Suicide | జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జూరాల జలాశయంలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ధరూర్ ఎస్ఐ నందీకర్ ఆధ్వర్యంలో రెస్క్యూ టీంతో జలాశయంలో గాలింపులు కొనసాగిస్తున్నారు

Lakes & Rivers

ఎస్ఐ నందీకర్ తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్లకు చెందిన‌ చాణక్య(26) హెటిరో ఫార్మాలో పని చేస్తున్నాడు.‌ శనివారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు 51వ గేటు వద్ద బ్యాక్ వాటర్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. 51వ గేటు వద్ద మృతుడి బైక్‌ను గుర్తించినట్లు చెప్పారు.

ఆదివారం ధరూర్ ఎస్ఐ నందీకర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖ సిబ్బంది, స్థానిక జాలర్ల సాయంతో జూరాల ప్రాజెక్టులో గాలింపు చర్యలు చేపట్టారు. చాణక్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.